Health

చేతులు కడుక్కుంటే జలుబు మాయం

జలుబు చేస్తే... మందులు షాపుకెళ్లి వారిచ్చిన ఏవో మాత్రలు వేసుకుని రొంపను వదిలించుకునేందుకు ప్రయత్నం చేస్తుంటాం. దీనికంటే తరచుగా చేతులను శుభ్రపరుచుకుంటుంటే పడిశాన్ని పారదోలవచ్చంటున్నారు పరిశోధకులు. విటమిన్ సి టాబ్లెట్లు మనిషి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయని తమ పరిశోధనలో రుజువైనట్లు తెలిపారు.

అయితే విటమిన్ సి మాత్రలు తీసుకుంటే జలుబు తగ్గిపోవడమే కాదు అవి క్యాన్సర్ వంటి భయంకర వ్యాధిని నిరోధిస్తాయన్న నమ్మకాలు గత కొన్నేళ్లుగా ఉన్నాయి. కానీ ఈ విటమిన్ మాత్రలతో ఒరిగేదేమీ లేదని పరిశోధకులు తేల్చిచెపుతున్నారు. కావాలనుకుంటే తమ పరిశోధనలను చూసుకోవచ్చని వారంటున్నారు.

విటమిన్ సి మాత్రలకు వ్యాధిని నియంత్రించే శక్తి లేకపోగా ఆ మాత్రలను వాడినవారు మాత్రం త్వరగా మరణించే అవకాశాలు ఉన్నాయన్నారు ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ పీటర్. అయితే పీటర్ వాదనతో విభేదిస్తున్నారు మరికొందరు. దీనిపై తాము కూడా అధ్యయనం చేసిన తర్వాతే పీటర్ అభిప్రాయాన్ని విశ్వసిస్తామంటున్నారు.

కాగా జలుబును వదిలించుకునేందుకు తరచుగా చేతులను శుభ్రపరుచుకుంటుంటే సమస్యకు దూరకావచ్చన్నది నిజమేనని వారు అంగీకరించారు. జలుబు ఒక్కటే కాదు ఇతర శ్వాసకోశ ఇబ్బందులకు సైతం దూరంగా ఉండవచ్చని వెల్లడించారు. సాధారణమైన సబ్బు నీటితో చేతులను శుభ్రం చేసుకుంటూ... ముఖంపైన చేతులను పెట్టుకోకుండా ఉన్నట్లయితే మొండి జలుబును నిరోధించవచ్చంటున్నారు.

ఎవరైతే జలుబు సమస్యతో బాధపడుతుంటారో వారు... తమ స్నేహితులకు షేక్ హ్యాండ్ ఇవ్వటంగానీ... లేదంటే వారు వాడిన టవల్స్.... తదితర వస్తువులను కుటుంబ సభ్యులు వాడటం కానీ చేయకపోవడం ఉత్తమమంటున్నారు.

..............................................................................................................................................................

నోటి దుర్వాసన ఉంటే దూరం కాక తప్పదు 

నోరు వాసన వస్తుంటే చాలా నామూషిగా ఉంటుంది. ఎవరితో మాట్లాడాలంటే బిడియపడుతుంటారు. నిజమే కదా మాట్లాడేటపుడు వినే వారికి కూడా అంతే ఇబ్బంది ఉంటుంది. ఇలా నోరు ఎందుకు దుర్వాసన వస్తుంటుంది. నివారణకు మార్గాలేమిటి

సాధారణంగా పళ్ళు, నోరు అపరిశుభ్రంగా ఉన్నందున నోటి దుర్వాసన వస్తుంది. నోటిలోని చిగుళ్ళు ఇన్ ఫెక్షను వల్ల కూడ రావచ్చు. మసాల పదార్థాలతో తయారు చేసిన ఆహార పదార్ధములు తీసుకొన్నపుడు దుర్వాసన వచ్చే అవకాశం వుంది.

నోరు తడిలేని వారికి రావచ్చు. దీర్ఘకాలక, శ్వాసకోశవ్యాదులు, ముక్కుకు సంబంధించిన వ్యాదులు కూడ కారణం కావచ్చును. పొగాకు నమలడం, బీడీ, సిగరెట్ మొ||నవి వాడడం కారణంకావచ్చును.

తీసుకోవలసిన జాగ్రత్తలు
నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి. ఆహారం తీసుకొన్నతరువాత నీటితో పుక్కలించి శుభ్రం చేసుకోవాలి. నాలుకను శుభ్రపరచాలి.
కట్టుడు పళ్ళు ఉన్నచో వాటిని క్రమం తప్పక శుభ్ర పరుచుకోవాలి.
వీలైనంత ఎక్కువగా నీరు తీసుకొవాలి. అన్నివేలల నాలుకను తడిగా వుండే విధంగా చూసుకోవాలి.

..............................................................................................................................................................
ఆమ్లాల వలనే గుండె మంట
సహజంగా చాలా మందిలో గుండె మంట కనిపిస్తుంటుంది. దీనిని నవీన యుగంలో అసిడిటీ అంటుంటారు. ఇది సాధారణంగా తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. తీసుకునే ఆహారం ఏ మాత్రం తేడా ఉన్నా, సమయ పాలన లేక పోయినా గుండె మంట ఆరంభమవుతుంది.

కడుపులోని కండరాలల్లో తేడానే కారణంగా గుండె మంట కలుగుతుందని చెప్పవచ్చు. మంటగా ఉండడం, మంట వలన కలిగే నొప్పి దాదాపు రెండు గంటల పాటు మనల్ని పట్టి పీడిస్తుంది. తిన్న తరువాత మరింత ఎక్కువ అవుతుంది. గుండె మంటకు చాలా కారణాలున్నాయి.

వాటిలో మసాలా ఆహారం తీసుకోవడం వలన కలుగుతుంది. ఎక్కువ కొవ్వు పదార్థాలు కలిగిన ఆహారం తీసుకోవడం కూడా గుండె మంటకు కారణమవుతుంది. పొగతాగడం వలన గుండె మంట వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. గర్భిణీలలో కూడా గుండె మంట అధికంగానే ఉంటుంది. ఆహార సమయాన్ని పాటించకపోవడం, స్థూలకాయాలు కూడా ఇందుకు కారణమవుతాయి.

తీసుకున్న ఆహారం అన్నవాహిక ద్వారా కడుపులోకి చేరుతుంది. అన్నవాహిక అనేది పొడవాటి గొట్టంలాగుంటుంది. చాతీ భాగంపై నుంచి నోటికి అనుసంధానం అయి ఉంటుంది. కడుపు దగ్గర లోయర్ ఎసోఫజియల్ స్ఫింక్టరే ఉంటుంది. కడుపు నుంచి వెనక్కు వచ్చే పదార్థాలను ఇది నిలరిస్తుంటుంది. ఇది కనుక బలహీనమైతేనో, సక్రమంగా పని చేయకపోతేనో కడుపులోంచి ఆమ్లాలు వెనక్కు ప్రయాణిస్తాయి. వీటి వలననే గుండె మంట పుడుతుంది.

కడుపులో ఎక్కువైన ఆమ్లం ఒత్తిడి పెంచుతుంది. అక్కడ నుంచి అన్నవాహికలోకి ప్రవేశిస్తుంది. అన్నవాహిక యాసిడ్‌ను నిలవరించలేదు. యాసిడ్ అన్నవాహిక ద్వారా ప్రయాణించేటప్పుడు విసుగ్గాను, మంటగాను అనిపిస్తుంది.

గుండె మంటకు చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. ఫెన్నల్‌ సీడ్స్ కూడా మంట నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే అరటిపండు కూడా మంచి ఫలితాన్నిస్తుంది. మసాలా ఆహారం తీసుకోవడాన్ని తగ్గించుకోవాలి. ఊరగాయలు పచ్చళ్ళు తీసుకోకూడదు.

..............................................................................................................................................................

మనిషి పీల్చి పిప్పి చేసే మలేరియా

మలేరియా పేరు చెప్పగానే అబ్బా...! మంచానికి అతుక్కు పోవాల్సిందేనా అనే మాట ఎవరి నోటైనా వినిపిస్తుంది. పడుకుని ఉండడం అంటే పర్వాలేదు. మనిషి పీల్చి పిప్పి చేస్తుంది. మనిషి కృశించి పోతాడు. వర్షా కాలం వచ్చిందంటే ప్రజా ఆరోగ్యానికి ఇది పెద్ద ముప్పు.

జాగ్రత్తలు తీసుకోక పోతే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. లక్షణాలిలా ఉంటాయి. తీవ్రంగా జ్వరం వస్తుంది. విడిచి విడిచి వస్తుంది. ఈ జ్వరాన్ని భరించం కూడా కష్టమే. నోరు ఆరకపోతుంది తీవ్ర జ్వరం కావడంతో ఏమి తిన్నా సహించ బుద్ధి కాదు. ఇది సాధారణంగా ఎక్కవగా వర్షాకాలంలోని వస్తుంది. ఈ వ్యాధికి దోమలు కారకాలుగా పని చేస్తాయి.

నివారణోపాయులు
ప్రధానమైనది ఒక్కటే దోమలు కట్టుకుండా చూసుకోవడం. కారకమైన దోమ కుడితే జ్వరం వచ్చి మలేరియా సంక్రమిస్తుంది. వచ్చిన తరువాత రక్త పరీక్ష చేయించుకుని వైద్యం చేయించుకోవడమే ఒక్కటే మార్గం. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం.

..............................................................................................................................................................


కడుపులో మంట... ఏం చేయాలీ...?
తీరికలేని పని ఒత్తిడితో సతమతమయ్యేవారిలో కొందరు ఉన్నట్లుండి భరించలేని కడుపు మంటతో బాధపడిపోతుంటారు. కడుపులో మొదలైన ఈ మంట క్రమంగా గొంతులోకి తన్నుకు వస్తున్నట్లు బాధ కలుగుతుంది. దీనినే మనం ఎసిడిటీ అని పిలుస్తుంటాం. ఈ ఎసిడిటీ ఏర్పడటానికి కారణాలు అనేకం ఉన్నాయి.

ముఖ్యంగా అధికంగా మసాలాలు వాడటం కడుపు మంటకు దారి తీస్తుంది. ఈ కడుపుమంటకు మార్కెట్లో ఎన్నో రకాల మందులు అందుబాటులో ఉన్నప్పటికీ క్రమబద్దమైన ఆహారటపులవాట్లు, జీవన విధానంలో కొన్ని మార్పులతో ఈ సమస్యకు దూరమవ్వవచ్చంటున్నారు వైద్య నిపుణులు. అవేంటో ఒకసారి చూద్దామా....

ముఖ్యంగా హడావుడిగా భోజనం చేసే పద్ధతికి స్వస్తి పలకాలి. మసాలాలు, బాగా వేయించిన కూరలు, చాక్లెట్లు, ఊరగాయ పచ్చళ్లు, పచ్చి ఉల్లి, మిరియాలు వంటివాటికి దూరంగా ఉండాలి. పచ్చి పండ్లను తినకూడదు. అలాగని పూర్తిగా బాగా పండిన యాపిల్ పండ్లను తినకూడదు.

అన్నం ముద్ద నోట్లో వేసుకోగానే ఒకేసారి మింగేయకూడదు. బాగా నమిలి మింగాలి. నీటిని అధికంగా తీసుకోవడం వలన కడుపు మంటను తరిమేయవచ్చు. రాత్రి వేళల్లో ఆహారం తీసుకునే సమయానికి నిద్రకు ఉపక్రమించే సమయానికి కనీసం 2 గంటలు తేడా ఉండాలి. అదే విధంగా భోజనానికి భోజనానికి మధ్య సమయం మరీ అధికంగా లేకుండా ఉండేటట్లు జాగ్రత్తపడాలి.

..............................................................................................................................................................

"వైన్"తో పేగు క్యాన్సర్ ప్రమాదం..!
ప్రతిరోజూ ఒక పూర్తి గ్లాసు వైన్ తాగేవారు కాలేయ, పేగు క్యాన్సర్ వ్యాధి బారిన ప్రమాదం దాదాపు ఐదురెట్లు పెరుగుతుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వోడ్కా, జిన్, ఆఖరుకు బీర్ తాగినా కూడా ఈ క్యాన్సర్ ముప్పు తప్పదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఈ విషయమై ప్రపంచ క్యాన్సర్ పరిశోధన నిధి (డబ్ల్యూసీఆర్ఎఫ్) సైన్స్ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ రాఛెల్ థాంప్సన్ మాట్లాడుతూ... రోజుకు రెండు యూనిట్ల చొప్పున ఆల్కహాల్ తీసుకున్నా కూడా పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం 18 నుంచి 20 శాతం వరకు ఉన్నట్లు పరిశోధనల్లో తేలిందని చెప్పారు.

ఇదిలా ఉంటే... ప్రతిరోజూ కొద్ది మొత్తంలో మద్యం పుచ్చుకున్నట్లయితే గుండెకు చాలా మంచిదని ఇప్పటికే చాలా పరిశోధనల్లో తేలిన సంగతి తెలిసిందే. ఆ సంగతలా కాసేపు పక్కనబెట్టి, రోజూ ఒక గ్లాసుడు బీరే కదా... ఏం చేస్తుందిలే అని అనుకున్నట్లయితే మాత్రం క్యాన్సర్ ప్రమాదానికి చేరువగా వెళ్తున్నట్లేననీ థాంప్సన్ పేర్కొన్నారు.

ఇందులో భాగంగా... బ్రిటన్ దేశంలో ప్రతి సంవత్సరం పెరుగుతున్న క్యాన్సర్ కేసులను పరిశీలించినట్లయితే... కొద్ది మొత్తంలో తీసుకుంటున్న ఆల్కహాల్, వైన్, బీర్‌లే ప్రమాదకరంగా పరిణమించి.. క్యాన్సర్ మహమ్మారి బారిన ఎలా పడవేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చునని రాఛెల్ ఈ సందర్భంగా వెల్లడించారు.


..............................................................................................................................................................
జలుబు...జలుబు...జలుబు
జలుబు వస్తే ఒక పట్టాన వదలదంటారు. నిజమే మరి. జలుబు వస్తే ఏ పనీ చేయబుద్ధికాదు. బాగా దుమ్ము, ధూళి ఉండే చోట నివసించేవారికి కూడా జలుబు తరచూ చేస్తూవుంటుంది. విటమిన్ ఎ, విటమిన్ సి లోపం వున్నవారికి కూడా తరచూ జలుబు ఉన్నట్లే అనిపిస్తుంది. కొందరు చంటిపిల్లలకు కూడా జలుబు ఓ పట్టాన విడువదు.

నివారణోపాయం..

**దుమ్ము..ధూళి ఎక్కువగావుండే చోట నివశించేవారు వాటినుండి రక్షణకి తగిన ఏర్పాటు చేసుకోవాలి.

**నశ్యం పీల్చడం అలవాటున్నవారు నశ్యం మానేయాలి. జలుబువుందని నశ్యం తీసుకుంటుంటారు, కానీ నశ్యం తీసుకుంటున్నంతవరకూ జలుబు తగ్గదు.

**జలబుకి ఎలర్జీకూడా ఒక కారణం అంటున్నారు వైద్యులు. కాబట్టి యాంటీబయోటిక్ మాత్రలు వాడితే దీర్ఘకాలంగా ఉన్నజలుబు తగ్గుతుంది. ముక్కు దిబ్బడగావుండి ఊపిరాడకుండావుంటే "ఎఫ్‌కార్లిన్" నాసల్ డ్రాప్స్ రోజుకి3..4 సార్లు ముక్కులో వేసుకోవాలంటున్నారు వైద్యులు.

**చిన్నపిల్లలకి జలుబు వదలకుండావుంటే వారికి పెన్సిలిన్ గాని, యాంపిసిలిన్ గాని వారం రోజులపాటు ఒక కోర్సుగా వాడాలి.

**గోరువేచ్చని నీటిలో కాస్త ఉప్పువేసి ఆ నీటితో ముక్కుని శుభ్రం చేయడం వలన కూడా జలుబుని నివారించవచ్చు.

**జలుబు విపరీతంగా వున్నప్పుడు బ్యాక్టీరియా క్రిములు చేరి జలుబుని తగ్గనివ్వకుండా చేస్తాయి. దీనికి పెన్సిలిన్, టెర్రామైసిన్ లాంటి యాంటీబయోటిక్ మందులు కోర్సుగా వాడాలని వైద్యులు సూచించారు. కనీసం పది రోజులపాటు వాడాలన్నారు.

**శరీరంలో రోగనిరోధక శక్తి అంతగా లేనివారు విటమిన్ ఎ, విటమిన్ సి లున్న పళ్ళు , ఆహారం, మాత్రలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

..............................................................................................................................................................

వెన్నునొప్పితో బాధపడుతున్నారా

మనిషి ఎన్నో సమస్యలతో బాధపడుతుంటాడు. వాటిలో ఆరోగ్య సమస్యలు మరీనూ. ఈ ఆరోగ్య సమస్యల్లో నొప్పులు, ఈ నొప్పుల్లోకూడా వెన్ను నొప్పిఒకటి. ఇది తదేకంగా కూర్చొని పనిచేసే వారిలో అధికంగా కనపడుతుందని వైద్యులు తెలిపారు. వారిలో ఎముకల అరుగుదల, తీవ్రమైన పని ఒత్తిడి వల్ల నడుము నొప్పి, దీంతోబాటు వెన్ను నొప్పికూడా ప్రమాదమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

నడుము నొప్పికి కారణమైన డిస్క్ అరుగుదలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న శస్త్రచికిత్సా పద్ధతులే కాకుండా మందుల ద్వారా కూడా రక్తసరఫరాను పెంచి తద్వారా అరిగిన డిస్క్‌ను పునరుత్పత్తి చేయవచ్చని వైద్యులు తెలిపారు.

ఎక్కువ మంది ఎదుర్కొనే వెన్నునొప్పికి ప్రథమంగా విశ్రాంతి, శక్తివంతమైన ఔషధాలు, వ్యాయామాల వంటి చికిత్సలు తీసుకోవాలి. వీటి ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదనుకున్న తరువాతే శస్త్రచికిత్స గురించి ఆలోచించాలని వైద్యనిపుణులు తెలియజేశారు.

సాధారణంగా డిస్క్‌లో అరుగుదల వల్ల వెన్నునొప్పి వస్తుందని అంతే కాకుండా నడుములో ఉండే కండరాలు, కీళ్ళకు సంబంధించిన కారణాల వల్ల కూడా నొప్పి వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉందంటున్నారు వైద్యులు.

ఇవే కాకుండా కొన్ని అసాధారణ సమయాల్లో, వెన్నెముకలోని ఎముకల్లో డొల్లతనం కూడా వచ్చే ఆస్కారం ఉంది. దీనికన్నాకూడా వెన్నునొప్పికి అసలైన కారణం పని ఒత్తిడేనంటున్నారు పరిశోధకులు.

ఎక్సరేలు ఎముకల స్థితిని తెలియజేస్తాయి. ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్ ద్వారా వెన్నుపూసను, నరాలను, వెన్నుపూస ఎముకల మధ్యగల డిస్క్‌ల పరిస్థితిని తెలియజేస్తుంది. ఈ పరీక్షలు ఒకదానికొకటి అనుసంధానింపబడినవి.

నరాలకు సంబంధించి ఈయమ్‌జీ...ఎన్‌సీవీ పరీక్ష ద్వారా అవయవాల్లో ఉన్న ప్రతి నరం యొక్క పనితీరును కనుగొనడానికి దోహదపడుతుంది.
నొప్పితీవ్రతనుబట్టి శస్త్రచికిత్స అవసరమా లేదా అనేది వైద్యం ప్రారంభించిన తర్వాత గాని చెప్పలేమంటున్నారు వైద్యులు.
పక్కమీద విశ్రాంతి, బాధను నివారించే మందులు, కీళ్ళను సామన్య స్థితికి తీసుకొచ్చే ఔషధాలు, వేడి నీటితో కాపడం పెట్టడం, ఫిజియోథెరపి ద్వారా పనిఒత్తిడిని నియంత్రించడం వంటి అనేక పద్ధతుల ద్వారా వెన్నునొప్పిని తగ్గించవచ్చు.

వెన్నెముక అనేక ఎముకల సముదాయంతో, ఒక దానిపై ఒకటి ఏర్పడింది. వెన్నెముక స్వయంగా అస్థిరమైనది. దానిచుట్టూ ఉండే కీళ్ళు దానికి స్థిరత్వాన్ని కలుగజేస్తాయి. కాబట్టి రోగి చేసే వ్యాయామాలు ఈ కీళ్ళను పటిష్టపరుస్తాయి.

ఇవి చేస్తే వెన్ను నొప్పిని కాస్త నివారించవచ్చు..

**కూర్చోవడం ద్వారా వెన్నెముక మీద ఎక్కువ భారం పడుతుంది. ఎక్కువ సేపు ఏకధాటిగా కూర్చోకూడదు.
వృత్తి పరంగా 6, 7 గంటలు ఏకధాటిగా కూర్చోవలసి వస్తే, గంటకొకసారి లేచి 5 నిమిషాల పాటు నడవాలి. ఇది వెన్నెముకకు తగినంత విశ్రాంతినిస్తుంది.

**ప్రత్యేకంగా షాక్‌ అబ్జార్బర్లు సరిగా పనిచేయని వాహనాలలో ప్రయాణిస్తే, కుదుపుల వల్ల వెన్నెముకకి ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి కుదుపులు అధికంగా కలిగించే వాహనాల్లో ప్రయాణించకూడదు.

**చేతులు ఉంచుకొనేందుకు వీలుగా ఉన్న కుర్చీలో కూర్చుంటే, వెన్నుపై భారం తగ్గుతుంది. కుర్చీకి వెనుక ఆనుకొనే సౌకర్యం ఉండాలి.

**నడుము వెనుక కింది భాగంలో ఉన్న ఖాళీ అమరే విధంగా, వెనుక ఆనుకొనే వీలుంటే చాలా మంచిది. ఈ సౌకర్యం లేని పరిస్థితులలో వ్యక్తి యొక్క వెనుక వైపు కింది భాగములో ఉన్న ఖాళీని పూరించడానికి ఒక దిండును అమర్చుకోవాలి. ఎల్లప్పుడూ నిటారుగా ఉండేవిధంగా కూర్చోవాలి.

**ముందుకు పెరిగిన పొట్ట వల్ల వెన్నెముకపై భారం పెరిగి వెన్నుపోటుకు కారణమవుతుంది. కాబట్టి పెరిగిన పొట్ట తగ్గించుకుని, శరీర భారాన్ని పరీక్షించుకుంటూ జాగ్రత్త పడాలి.

**ప్రతిరోజూ అరగంట పాటు ఉదయం, సాయంత్రం వేగంగా నడవాలని వైద్యులు సూచిస్తున్నారు.

..............................................................................................................................................................

క్యాన్సర్...క్యాన్సర్...క్యాన్సర్
క్యాన్సర్ అంటే ప్రజలలో అపోహలు నెలకొనివున్నాయి. దాదాపు 80 శాతం ప్రజలు తమకుకూడా క్యాన్సర్ వుందని అపోహ పడుతుంటారు. కాని ఇది ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా వుంటుంది.

క్యాన్సర్ బాగా ముదిరిన తర్వాత డాక్టర్ల వద్దకు పరుగులు తీస్తుంటారు. చాలామంది క్యాన్సర్‌కు చికిత్స లేదని భావిస్తుంటారు. కాని ప్రస్తుతం మనకు అందుబాటులోనున్న వైద్య పరిజ్ఞానంతో క్యాన్సర్‌కు చికిత్స చేయవచ్చని వైద్యులు తెలిపారు.

క్యాన్సర్ అంటే ఏంటి ?

శరీంలోని ఎదైనా భాగంలో అసామాన్యమైన రీతిలో కణితి పుట్టుకువస్తుంది. ఈ జబ్బును వివిధ రకాలుగా విభజిస్తారు. ఇవి శరీరంలోని వివిధ భాగాలకు తగ్గట్టు ఆధారపడుతుంది.

ఇవి ఎన్ని రకాలు ?

ఎముకలలో ఏర్పడే కణితులను బోన్ ట్యూమర్ అంటారు. దీనికి నివారణ ఏ ఎముకలోనైతే కణితి ఏర్పడిందో ఆ ఎముకను తొలగించక తప్పదంటున్నారు వైద్యులు. దీనిని తొలగించాలంటే రేడియేషన్ ద్వారా క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించవచ్చు.

ఇదే కాకుండా రక్తంలో కూడా క్యాన్సర్ వుంటుందని దీనిని రక్త క్యాన్సర్ అంటారని వైద్యులు చెబుతున్నారు.

సామాన్య లక్షణాలు ఏంటి ?

శరీరంలోని ఏ ప్రాంతంలోనైనా కణితి లాంటిది ఏర్పడి ఉన్నట్టుండి రక్తం కారుతుంటే చర్మంలో కాసింత మార్పు సంభవించడం, ఆకలి లేకపోవడం, దగ్గు విపరీతంగా రావడం, దగ్గుతోబాటు రక్తం రావడం లాంటివి ఈ క్యాన్సర్‌కు నిదర్శనం.

చికిత్స ఎలా ?

ముందుగా క్యాన్సర్‌ను కనుగొనడానికి బయోప్సి ద్వారా పరీక్షిస్తారు. ఇందులో క్యాన్సర్‌లోని చిన్న కణాన్ని తీసి దానిని పరీక్షకు పంపుతారు. దీనినే బయోప్సి అంటారు.

ఒక వేళ ఆ కణితి చిన్నదిగా వుంటే ఆ మొత్తం కణితిని తీసి పరీక్షకు పంపుతారు. అదే పెద్దదైతే అందులోని చిన్నభాగాన్నితీసి పరీక్షకు పంపుతారు. క్యాన్సర్ అని నిర్ధారించుకున్న తర్వాత ఏ చికిత్సనైతే మొదలుపెడుతారో దానినే కిమోథెరపీ అంటారు.

క్యాన్సర్‌‌ను తగ్గించడానికి కిమోథెరపి చికిత్సను ప్రారంభిస్తారు. ఒకవేళ క్యాన్సర్ చివరి స్థానంలో వుంటే దాని నివారణకు ఈ చికిత్స బాగా ఉపయోగపడుతుందని వైద్యులు తెలిపారు.

ఈ చికిత్స అన్ని రకాల క్యాన్సర్‌లకు వర్తించదు. అలాగే రేడియోథెరపి కూడా క్యాన్సర్‌ను తగ్గించడానికి వాడే చికిత్సా విధానంగా పేర్కొన్నారు వైద్యులు.
..............................................................................................................................................................

ఫాస్ట్‌ఫుడ్‌తో కీళ్ల నొప్పులు... ఎముకల సమస్యలు!!
అధిక కొవ్వు కలిగిన ఫాస్ట్‌ఫుడ్స్ తీసుకోవడం సహజంగానే కండరాల శక్తిసామర్థ్యాలపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వాటిని పరిమితి దాటి ఉపయోగించినప్పుడు ఆ ఒత్తిడిని తట్టుకునే పరిస్థితి వాటికి ఉండదు. ఫలితంగా అవి నొప్పికి దారితీస్తుందని అధ్యయనకారుల విశ్లేషణ.

ఫాస్ట్‌ఫుడ్స్ ఎక్కువగా తినేవారిలో కీళ్లు, ఎముకల సమస్యలతో పాటు రకరకాల బాధలు కనిపిస్తాయి. దీనికి పరిష్కారం ఇంట్లో తయారుచేసుకొను తక్కువ కొవ్వు కలిగిన ఆహారాన్ని తీసుకోవడమే.

ఈ ఫాస్ట్‌ఫుడ్ ఆహారం కాల్షియం, విటమిన్ల లోపం ఎముకలు, కండరాలు బలహీనం కావడానికి కారణమవుతుంది. కాబట్టి సమతులాహారాన్ని తీసుకోవడం ద్వారా ఇటువంటి సమస్య రాకుండా చూసుకోవచ్చు.


..............................................................................................................................................................
 
గురక సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?
గురక సమస్య నుంచి బయటపడాలంటే పక్కకు తిరిగి పడుకోవటం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గురక అనారోగ్యాన్ని సూచిస్తుంది. అందుచేత మత్తు పానీయాల అలవాటుంటే మానేయాలి. గొంతు భాగంలో గాలి వెళ్ళే నాళాలు బాగా సన్నగా ఉంటే గాలి ఒక గరాటు రూపంలో నుంచి వెళుతున్నట్టుగా అయి ధ్వనిని సృష్టిస్తుంది.

అంగుటి మీదున్న మెత్తని కణజాలపు కదలిక వల్ల కొందరికి గురక వస్తుంది. గొంతు ముక్కు భాగంలో కణజాలం అధికంగా ఉన్నప్పుడు ఈ సమస్య కొందరిలో ఏర్పడుతుంది. భారీకాయం గురకకు ఒక కారణమే. గొంతు, మెడ భాగంలో అధికంగా చేరిన కణజాలం వల్ల గురక ఏర్పడుతుంది. గుర్రు పెట్టేటప్పుడు నోరు మూతబడి ఉంటుంటే దానికి కారణం నాలుకగా గుర్తించాలి.

నోరు తెరచి గుర్రు పెడుతుంటే సమస్య గొంతు కణజాలంలో ఉన్నట్టు గుర్తించాలి. అందుచేత గురక పెట్టేవారు ఏదైనా పదార్థాలకు ఎలర్జీ ఉంటే అటువంటి వాటిని తినొద్దు.
 
..............................................................................................................................................................


క్యాన్సర్‌, హృద్రోగ సమస్యలకు చెక్ పెట్టే దానిమ్మ పండు!

దానిమ్మ పండ్లను ప్రతిరోజూ తీసుకుంటే క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరానికి కావాల్సిన శక్తినిచ్చిన దానిమ్మ పండును రోజు వారీగా అరకప్పు తీసుకుంటే మంచి ఫలితముంటుందని వారు చెబుతున్నారు.

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ దానిమ్మలో పీచుపదార్థాలు అధికంగా ఉన్నాయి. శరీరానికి కావాల్సిన విటమిన్ ఎ, సి, ఈలను దానిమ్మ అందజేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే హృద్రోగ సమస్యలకు దానిమ్మ పండు చెక్ పెడుతుంది.

దానిమ్మ పండ్లను అరకప్పు తీసుకోవడం ద్వారా చెడు కొవ్వు పదార్థాలు కరిగిపోతాయని, ఊబకాయాన్ని నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు చర్మ సమస్యలకు నయం అవుతాయి. రక్తప్రసరణ సక్రమంగా సాగడం కోసం దానిమ్మను తీసుకోవాలి. గొంతునొప్పికి దానిమ్మ దివ్యౌషధంగా పనిచేస్తుంది.


 
..............................................................................................................................................................


మేనరిక వివాహాలతో ఆరోగ్య సమస్యలంటున్న వైద్యులు!
సాధారణంగా రక్త సంబంధాల వివాహాలు (మేనరికాలు) సమాజంలో ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ తరహా వివాహాలకు యువతీ యువకులు అంగీకరించక పోయినా.. వారిపై బలవంతం చేసి మేనరిక వివాహాలు చేస్తున్నారు. దీనివల్ల అనేక అరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. దీనికి గల కారణాలపై వైద్యులను సంప్రదిస్తే..

రక్త సంబంధాల్లో వివాహాలు ఖచ్చితంగా అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. జన్యు సంబంధమైన వ్యాధులతో పిల్లలు పుట్టడమే కాకుండా.. అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానూ ఉన్నాయి. లేదా పిల్లలు మానసిక వికలాంగులుగా పుట్టొచ్చు. వీటితో పాటు.. అనేక జన్యుపరమైన సమస్యలు ఉత్పన్నం కావొచ్చని వైద్యులు అంటున్నారు.  


 ..............................................................................................................................................................


 చెర్రీ జ్యూస్‌ తీసుకుంటే.. హాయిగా నిద్రపోతారట..!!

ప్రతి రోజూ చెర్రీ జ్యూస్ రెండు గ్లాసులు తాగితే హాయిగా నిద్రపడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అంతర్జాతీయ పరిశోధకుల బృందం నిర్వహించిన అధ్యయనంలో రోజూవారీగా రెండు గ్లాసుల మేర చెర్రీ జ్యూస్ తీసుకునే వారు.. జ్యూస్ సేవంచని వారి కంటే 39 నిమిషాల పాటు అధికంగా నిద్రపోతున్నారని కనుగొన్నారు.

అంటే.. ఈ జ్యూస్ తీసుకునే వారు 6 శాతం హాయిగా నిద్రపోతున్నారని పరిశోధకులు తెలిపారు. నర్తంబ్రియా యూనివర్శిటీ 20 మంది పెద్దలపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇంకా హాయిగా నిద్రపట్టిందే ఈ జ్యూస్, నిద్ర సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు.  
  
 ..............................................................................................................................................................


 గుండెపోటు వచ్చినపుడు ఛాతీ నొప్పి వచ్చి తీరాలనే నియమం లేదు
చాలాకాలం నుంచీ ఛాతీలో హఠాత్తుగా నొప్పి కలగడాన్ని మనం హార్ట్ అటాక్‌గా భావించడం జరుగుతోంది. కానీ, ఫ్లోరిడాలోని ఒక ఛెస్ట్ పెయిన్ సెంటర్ పరిశోధనలో ఎంతోమందికి హార్ట్ అటాక్ వచ్చినా ఛాతీలో నొప్పి ఏర్పడటం లేదని తేలింది.

ప్రముఖ కార్డియాలజిస్ట్ అశ్విన్ మెహతా చెప్పినదాన్ని బట్టి భారతదేశంలో 20 నుండి 30 శాతం మంది రోగులు నొప్పి ఏర్పడని హార్ట్ అటాక్‌తో హాస్పిటల్‌లో చేరడం జరుగుతోంది. ఆయన పరిశీలనలో హైపర్ టెన్షన్ మరియు మధుమేహం ఉన్నవారికి ఇలాంటి నొప్పిలేని హార్ట్ అటాక్ వస్తుందని తేలింది.

కొన్ని కేసుల్లో మాత్రం ఆ సంకేతాలు బలహీనంగా ఉంటాయి. మెహతా అభిప్రాయాన్ని సమర్ధిస్తూ జెజె హాస్పిటల్ కార్డియాలజిస్ట్ అనిల్ కుమార్, "సైలెంట్ హార్ట్ అటాక్ కొత్తదేమీ కాదు, అధిక రక్తపోటు మరియు మధుమేహంతో బాధపడేవారిలో చాలామందికి ఛాతీలో నొప్పి కలగకపోవడం లేదా తక్కువగా రావడం జరుగుతుంది" అని చెప్పారు.


 
 ..............................................................................................................................................................
  

రోజూ 30 నిమిషాలు నడవలేదంటే... ఆరోగ్యానికి ముప్పు
ప్రతిరోజూ క్రమం తప్పకుండా, కనీసం 30 నిమిషాలపాటు నడక సాగించినట్లయితే... శారీరక బాధలు దూరమవడమే గాకుండా, ఎలాంటి వ్యాధులూ దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. నిమిషానికి వంద అడుగుల చొప్పున వేగంగా నడిచే నడక శరీరంలోని అదనపు శక్తిని మండించటమేగాకుండా, మధుమేహం లేదా గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

పై అధ్యయనం చేపట్టిన అమెరికా శాండియాగో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు మాట్లాడుతూ... 30 నిమిషాలపాటు చేసే ఒక మోస్తరు తీవ్రత కలిగిన వ్యాయామం పెడోమీటరులో 3 వేల అడుగులతో సమానంగా లెక్కించవచ్చునని అన్నారు. ఊబకాయం రాకుండా ఉండేందుకు, రక్తపోటును నియంత్రించేందుకు, గుండెజబ్బుల నివారణకు వారానికి కనీసం ఐదు రోజులపాటు.. రోజుకు అరగంటసేపు వ్యాయామం చేయడం మంచిదని వారు సూచిస్తున్నారు.

వీరు అధ్యయనంలో భాగంగా... వ్యాయామం, పోషక శాస్త్ర శాఖకు చెందిన సిమన్ మార్షల్.. అతని పరిశోధనా బృందం 58 మంది పురుషులు, 39 స్త్రీలపై పై అధ్యయనాన్ని నిర్వహించారు. నిమిషానికి 91-115 అడుగుల నడక మహిళలలో ఒక మోస్తరుపాటి తీవ్రతతో కూడిన వ్యాయామ ప్రభావాన్ని సాధిస్తుందనీ... అదే మగవారిలో 92-102 అడుగుల్లోనే సాధించగలుతున్నట్లు తాము కనుగొన్నామని శాండియాగో పరిశోధకులు వెల్లడించారు. కాగా, అమెరికన్ జర్నల్ ఆప్ ప్రివెంటివ్ మెడిసన్ వారు... ఈ అధ్యయనం వివరాలను ప్రచురించారు.


 ..............................................................................................................................................................

 రాత్రి షిఫ్టుల్లో పని... గుండెపోటు, క్యాన్సర్ వచ్చే ఛాన్స్
ఉద్యోగరీత్యా రాత్రిపూట షిప్టుల్లో పనిచేసేవారికి గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం మేర మెండుగా ఉంటుందని తాజా పరిశోధనల్లో వెల్లడయింది. దీనికి కారణం రాత్రిపూట పనిచేసేవారి ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరమైనవిగా ఉండకపోవడంతోపాటు సరియైన సమయానికి నిద్ర పోలేకపోవడం కారణాలుగా వారు చెపుతున్నారు.

లండన్‌కు చెందిన స్ట్రోక్ ప్రివెన్షన్ అండ్ అథెరోస్క్లెరోసిస్ రీసెర్చ్ సెంటర్(స్పార్క్) రాత్రివేళల్లో పనిచేసేవారిపై అధ్యయనం జరిపారు. ఈ అధ్యయనంలో షిఫ్టు పద్ధతిపై పనిచేసేవారిలో 25 శాతం మేర సమస్య వెలుగుచూడగా రాత్రివేళల్లో మాత్రమే పనిచేసేవారికి 41 శాతం మేర సమస్య ఉన్నట్లు తేలింది.

ఈ అధ్యయనం వివరాలను బ్రిటిషన్ మెడికల్ జర్నల్ వెబ్‌సైట్‌లో అధ్యయనకారులు ఉటంకించారు. రాత్రిపూట పనిచేసేవారు ఎక్కువగా జంక్ ఫుడ్ ను తీసుకోవడమే కాకుండా సరిగా నిద్రపోలేరనీ, ఇంకా వ్యాయామం కూడా చేయకుండా ఉదయం పూట నిద్ర లాగించేస్తుండటం వల్ల గుండె సంబంధిత సమస్యలు పీడించే అవకాశం ఉందని వెల్లడించారు.

రాత్రిపూట పనిచేసే 20, 11, 935 మందిపై 34 రకాల పరీక్షలు చేసిన అనంతరం ఈ విషయం తేటతెల్లమయిందన్నారు. ముఖ్యంగా ఇష్టానుసారంగా షిప్టులను మారుస్తూ.. అంటే ఒకరోజు ఉదయం అయితే మరుసటి రోజు రాత్రి, ఆ తర్వాత మళ్లీ ఉదయం వంటి రొటేషన్ షిఫ్టు పద్ధతులు కూడా ఆరోగ్యాన్ని గుల్ల చేస్తాయని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధికి కూడా ఈ షిఫ్టు పనులు దోహదకారిగా నిలిచే అవకాశం ఉందని చెపుతున్నారు.
 ..............................................................................................................................................................

సంబంధాలను తెంచేసే సెల్‌ఫోన్లు... తస్మాత్ జాగ్రత్త..!!
సెల్ ఫోన్లు మాటలను, మనుషులను కలుపుతాయని అనుకోవడం పొరపాటని అంటున్నారు శాస్త్రజ్ఞులు. ఇవి మనుషుల మధ్య సంబంధాలను తెంచి పారేస్తాయని అంటున్నారు.

మొబైల్ ఫోన్లను ఖాళీగా గదిలో ఓ మూలన పడవేసినా ఇతరులతో మనం జరిపే సంప్రదింపులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఎసెక్స్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.

సెల్‌ఫోన్ వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాల్లో వచ్చే తేడాలను గర్తించడానికి రెండు ప్రయోగాలను వారు చేశారు. ఈ ప్రయోగాలలో సెల్ ఫోన్ వల్ల వ్యక్తుల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నట్లు కనుగొన్నారు.
 
 ..............................................................................................................................................................

నిద్రను అదిమిపట్టి ఆపేస్తే డయాబెటిస్ ప్రమాదం
నిద్ర సరిగా పోనివారికి డయాబెటిస్ త్వరగా సోకే ప్రమాదముంది. మూడురోజులు వరుసగా తగినన్ని గంటలు నిద్రపోలేకపోతే శరీరంలో వచ్చే మార్పులలో ముఖ్యమైనది రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో మార్పులు వస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఆ నియంత్రణ వ్యవస్థలో లోపం ఏర్పడటంతో షుగర్ జబ్బు వస్తుంది. బలవంతంగా నిద్రను అదిమిపెట్టి రాత్రుళ్ళు ఎక్కువసేపు మెలకువతో వుండే విద్యార్థులు గుర్తించాల్సిన విషయం ఇది.

అయితే వయసులో వుండగా దీని ప్రభావం వెనువెంటనే కనిపించకపోవచ్చంటున్నారు. కానీ భవిష్యత్ జీవితంలో ఇది సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదముందంటున్నారు. ఇక డయాబెటిస్ లక్షణాలు ఇప్పటికే కనిపించిన వారు నిద్ర విషయంలో తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.

నిద్రలేమి వారి కొంపముంచుతుంది. హఠాత్తుగా రక్తంలో చక్కెరలు తారాస్థాయికి చేరి రోగిని కోమాలోకి తీసుకువెళ్ళే ప్రమాదం సైతం ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ రోగులు తగినంత వ్యాయామం, నిద్ర విషయంలో తగిన జాగ్రత్తలు వహించండం మరవకూడదంటున్నారు వైద్యులు.
 
 ..............................................................................................................................................................

 
సెల్‌ఫోన్లతో బ్రెయిన్ క్యాన్సర్: డబ్ల్యూహెచ్ఒ హెచ్చరిక  
మొబైల్ ఫోన్ వినియోగదారులకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ఇయర్ ఫోన్స్ వాడటం ఒక్కటే పరిష్కార మార్గమని వెల్లడించింది.

మొబైల్ పరికరంలో ఉన్న రేడియోఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమేగ్నటిక్ ఫీల్డ్స్ వల్ల మెదడుకు క్యాన్సర్ వచ్చే అవకాశమున్నట్లు "ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్" వెల్లడించింది.

సెల్ ఫోన్లను అదేపనిగా ఉపయోగించే వినియోగదారులపై సుదీర్ఘమైన పరిశోధనలు చేసిన అనంతరం వారి మెదడుపై చూపే ప్రభావాన్ని కనుగొన్నారు. ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు కూడా తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.

పదేళ్లపాటు రోజుకి 30 నిమిషాలు క్రమం తప్పకుండా సెల్ ఫోన్ వినియోగించేవారిలో బ్రెయిన్ క్యాన్సర్ తలెత్తే అవకాశం పుష్కలంగా ఉన్నదని వారు హెచ్చరించారు. ఎన్ని హెచ్చరికలు చేసినా సెల్ ఫోన్ వినియోగదారులు మాత్రం తమ చెవుల్లోనే పొద్దస్తమానం సెల్‌ను పెట్టుకుని మాట్లాడటం కనిపిస్తూనే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలోనైనా హెడ్‌ఫోన్స్ సాయంతో సెల్ ను ఉపయోగిస్తే మంచిది.
..............................................................................................................................................................
  
గుండె జబ్బులను నిరోధించే టమోటా 
ఎర్రగా నిగనిగలాడే టమోటాలు గుండె జబ్బులు రాకుండా చూస్తాయని పరిశోధనల్లో తేలింది. టమోటాలను రోజూ తింటే కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గుతాయని కనుగొన్నారు. టమోటాల్లో లైకోపెన్ అనే ఎర్రటి వర్ణద్రవ్యంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయని అడిలైడ్ విశ్వవిద్యాలయానికి చెందిన అంతర్జాతీయ పరిశోధకుల బృందం పేర్కొంది. గత 55 ఏళ్లుగా జరిగిన 14 పరిశోధనల ఫలితాలను పరిశోధకులు క్రోడీకరించి చూసినప్పుడు ఇది తేలింది.

రోజూ 25 మిల్లీగ్రాముల లైకోపెన్ తీసుకుంటే చెడు కలెస్ట్రాల్ 10 శాతం వరకూ తగ్గుతున్నట్లు తేలినట్లు వెల్లడించారు. లైకోపెన్ అధికంగా ఉండే టమోటాలతో చేసిన అరలీటరు రసంగానీ, 50 గ్రాముల గుజ్జుగానీ రోజూ తీసుకుంటే గుండె జబ్బుల నుంచి కాపాడుకోవచ్చని పరిశోధకులు సూచించారు.
 
 ..............................................................................................................................................................

 పొడగరి ముద్దుగుమ్మలకు క్యాన్సర్ ముప్పు!!
చాలా మంది మహిళలు ఉండాల్సిన దాని కంటే ఎక్కువ పొడవుగా ఉంటారు. ఇలాంటి వారు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నట్టు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ జేన్‌ గ్రీన్‌ ఆధ్వర్యంలోని ఒక పరిశోధనా బృందం నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. క్యాన్సర్‌ వ్యాధికి మహిళ ఎత్తుకు సంబంధం ఉన్నట్టు తెలిపింది. ప్రతీ 10 సెంటీమీటర్ల పెరుగుదలకు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు 16 శాతం ఉన్నట్టు ఈ పరిశోధకులు చెపుతున్నారు.

ఇదే అంశంపై 1996 నుంచి 2001 వరకు 13 లక్షల మంది మధ్య వయస్సు గల మహిళలపై అధ్యయనం చేశారు. వీరిలో సగటున పదేళ్ళ కాలంలో 97,000 మంది క్యాన్సర్‌ రోగులను గుర్తించినట్టు చెప్పారు.

ఈ తరహా క్యాన్సర్ ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర అమెరికా, యూరోప్‌ ఖండాల్లోని దేశాతో పాటు ఇతర దేశాల్లో కూడా ఒకే విధంగా ఉంటుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. వీరి అధ్యయన వివరాలు లాన్సెట్‌ ఒంకాలజీ ఆన్‌లైన్‌ ఎడిషన్‌‌లో తాజాగా ప్రచురితమయ్యాయి.

పెరుగుతున్న ఎత్తుమూలంగా కలిగే క్యాన్సర్‌ వ్యాధుల్లో బ్రెస్ట్‌. గర్భకోశం, ల్యుకేమియా, అండాశయం, పేగు, చర్మ తదితర రకాల క్యాన్సర్లు రావచ్చని జేన్‌ గ్రీన్‌ అభిప్రాయపడ్డారు.  
 
 
 ..............................................................................................................................................................

 
కాఫీ తాగితే పక్షవాతానికి దూరం!!
 కాఫీ ప్రియులకు ఓ శుభవార్త. ఒక రోజుకు రెండు లేదా మూడు కప్పుల కాఫీ తాగితే పక్షవాతం వంటి వ్యాధులు దరిచేరవని స్వీడన్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. అదేసమయంలో ఇష్టానుసారంగా తాగితే మాత్రం బీపీ వంటి రోగాలు కొని తెచ్చుకున్నట్టేనని వారు హెచ్చరిస్తున్నారు.

స్వీడన్‌లోని పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయన వివరాలను పరిశీలిస్తే.. 1960 నుంచి స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు దాదాపు ఐదు లక్షల మంది కాఫీ ప్రియులపై ఈ అధ్యయనం చేసినట్టు తెలిపింది.

కాఫీ తాగితే మెదడులో రక్తం గడ్డ కట్టడాన్ని 14 శాతం తగ్గిస్తుందని వారు తెలిపారు. అలాగే, కాఫీ ద్వారా చెడ్డ కొలస్ట్రాల్ నుంచి మెదడును కాపాడవచ్చు. అయితే కాఫీ మోతాదు ఎక్కువైతే రక్తపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని వారు హెచ్చరించారు. ఈ విషయాలన్నీ అమెరికల్ జర్నల్‌లో ప్రచురితం చేశారు.

    
 ..............................................................................................................................................................

 నూనె - ఉప్పు ఎక్కువ తింటే గుండెకు ముప్పే!!
నూనెలు, కొవ్వు పదార్థాలు, ఉప్పులను సాధారణ స్థాయికి మించి వాడడం వల్ల దేశంలో ఎక్కువ శాతం పౌరులు గుండె జబ్బుల పాలవుతున్నారని తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. అలాగే, 46 శాతం మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని సర్వే తెలిపింది. నూనె, ఉప్పు, ఇతర కొవ్వు పదార్థాలను మోతాదుకు మించి అంటే అతిగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు, చక్కెర వ్యాధికి లోనవుతున్నట్టు వెల్లడైంది.

ఇలాంటి వ్యాధుల బారిన పడుకుండా ఉండాలంటే రోజుకు 400 గ్రాముల పండ్లు, కూరగాయలు తీసుకుంటే మంచిదని భారత ప్రజా ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. అయితే, ఈ నివేదికకు విరుద్ధంగా 1992లో 18 గ్రాములున్న నూనె వాడకం 2005లో 50 శాతానికి చేకినట్టు ఆ సంస్థ పేర్కొంది.

అదేవిధంగా కొవ్వు వాడకం 41 - 52 గ్రాములకు చేరినట్టు ఆ నివేదిక తెలిపింది. హైబీపీకి కారణమైన ఉప్పును ప్రపంచ ఆరోగ్య సంస్థ రోజుకు ఐదు గ్రాములు సూచించినప్పటికీ ఎక్కువ శాతం మంది 9 - 12 గ్రాములు తీసుకుంటున్నారని, ఫలితంగా పెక్కు శాతం మంది పౌరులు అనారోగ్యం బారిన పడుతున్నట్టు తేలిందన్నారు. ప్రస్తుతం దేశంలో సుమారు మూడు కోట్ల మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారని ఆ నివేదిక తెలిపింది.  Thanks


Admin :
praneeth
9441022550
(www.praneeth.in)

srikakulam, pathapatnam, pathapatnam schools, srikakulam schools, srikakulam colleges, srikakulam temples, srikakulam hospitals, srikakulam pathapatnam, patha patnam, pathapatnam.com, pathapatnam colleges, srikakulam, colleges, temples, hospitals, villages, web designing, web developing,srikakulam politics, Amadalavalasa, Timmapuram, Krishnapuram, Kasimvalasapeta, Gedelavanipeta, Akkivavalasa, Nandagiripeta,Chintada,OldRailwayGate,Mettakkivalasa,HudcoColony,KuppilivariVeedhi,LaxmiNagar,Vidyanagar,I.J.NaiduColony,PathinavaniVeedhi,Market- Street,PujariPeta,BoddepalliPeta,OldAmadalavalasa,VengalaraoColony,Kuddiram,Laxmudupeta,Venkayyapeta,Voosapuvanipeta, Garimella Kottavalasa,Koravam,MarriKottavalasa,Nimmatorlada Vedullavalasa, Turakapeta, Tandemvalasa, Nelliparti, Chintalapeta, Bobbilipeta, Mandadi, Cheemalavalasa,SantaKottavalasa ChinnaJonnavalasa, Munagavalasa, Sailada, Chittivalasa, Anandapuram, Ramachandrapuram, Ponnampeta, kalaparthi, PeddaJonnavalasa, Srinivasacharyulapeta, Akkulapeta, MalluSastrulapeta, Hanumantupuram, Katyacharyulapeta, Korlakota,Korlakota, kottavalasa, Togaram, Kalivaram, Dusi, Belamam, Roja, Totada, Akkivaram, Vanjangipeta ( Gattumudipeta ), Vanjangi, Kanugulavalasa, Sriramavalasa, Amadalavalasa. --------------------------------------------------- Bhamini Baleru, Battili, Bellumada, Bhamini, Burujola, Chinna Dimili, Dimmidijola, Ghanasara, Katragada, Keesara, Korama, Kosali, Liviri, Maniga, Manumakonda, Neradi, Nulakajodu, Pasukudi, Pedda Dimili, Sativada, Thalada, Vaddangi, ---------------------------------------------- burja A. P. Peta, Allena, Annampeta, Burja, Ceedivalasa, Chinalankam, Donkalapartha, Guttavelli, Hanumayyapeta, Kalaparthi, Kantlam, Koaragam, Kollivalasa, Labham, Lakkupuram, Mamidivalasa, Neeladevipuram, O.V.Peta, P. L. Devipeta, Palavalasa, Pedalankam, Peddapeta, Singannapalem, T. D. R. Rajupeta(ayyavri peta ), Thotavada, Uppinivalasa, Vavam, Vykuntapuram, ------------------------------------------------------------ Etcherla, Etcherla mandal, A.A.Valasa, Ajjaram, Allinagaram, Badevanipeta, Bhagiradhi Puram, Bontala Koduru Budagatla Palem, Chilakapalem, D.Matchelesam, Dharmavaram, Domam, Etcherla, Fareedpeta, Ibrahimbad, Jarajam, Kesavarao Peta, Kongaram, Kotha Peta, Koyyam, Kuppili, Kusalapuram, Muddada, Ponnada, Pudivalasa, S.M.Puram, S.S.R.Puram, Thamminaidu Peta, Thotapalem, Fareed Peta ----------------------- Ganguvari Sigadam Anandhapuram, Batuva, Chettupodilam, Dalemrajuvalasa, Devaravalasa, Dhavalapeta, G.Sigadam (village, and mandal headquarters) Geddakancharam, Gobburu, Jada, Jagannadhavalasa, Kapparam, Madhupam, Marrivalasa, Mettavalasa, Musinivalasa, Nadimivalasa, Nagulavalasa, Niddam, Palakhandyam, Penta, Punnam, S.P.R.Puram, Santhavurity, Seetampet, Sethubhimavaram, Tankala.Duggivalasa, Vandrangi, Velagada, Venkayyapeta, Yenduva, -------------------------------------------------------------- Gara, Srikakulam ------------------ Hiramandalam Akkarapalli, Ambavellia, B.R.Puram, Chinnakollivalasa, Chorlangi, Dhanupuram, Duggupuram, Garlapadu, Gotta, Gulumuru, Hiramandalam, Kallata, Kittalapadu, Komanapalli, Kondaragolu, Mahalaxmi Puram, Padali, Pedda Sankili, Pindruvada, Rugada, Tampa, Thungathampara, Tulagam ----------------------------------- Ichchapuram Arakabadra, Balakrishnapuram, Birlangi, Boddabada, Burjapadu, Dharmapuram, Edupuram, Haripuram, Kedaripuram, Keerthipuram, Kesupuram, Koligam, Kothari, Loddaputti, Mandapalli, Masakhapuram, Mutchindra, Paitari, T.Berhampuram, Telukunchi, Tulasigam (village) ------------------------------------------------------- Jalumuru Akkurada, Allada, Alladapea, Andhavaram, Atchyuthapuram, Basivada, Bodapadu, Challavanipeta, Chennaiahvalasa, Chinadugam, Darivada, Gotivada, Guggili, Hussainpuram, Jalumuru (village, and mandal headquarters) Jonanki, Karakavalasa, Karavanja, Komanapalle, Kondapolavalasa, Kurmanadhapuram, Lingalavalasa, Makivalasa, Marrivalasa, Mukhalingam, Nagarakatakam, Pagodu, Parlam, Peddadugam, Ramaiahvalasa, Rana, Ravipadu, Subrahmanyapuram, Suravaram, Syrigam, Talatariya, Tekkalipadu, Timadam, Venkatapuram, Yelamanchili - Konda Kameswara Peta --------------------------------------------------------------- Kanchili Ampuram, Bellupada, Bhogabeni, Bhyripuram, Booragam, Chinna Khojjiria, Dola Govindapuram, Gokarnapuram, Jadupudi, Jalanthrakota, Kanchili, Kattivaram, Kesaripada, Kokkili Puttuga, Kolluru, Konnai Puttuga, Kumbari Nowgam, Kuttuma, Makarampuram, Mandapalli, Matam Sariapalli, Mundala, Pedda Khojjiria, Pedda Srirampuram, Poleru, Purushottapuram, S.R.C.Puram, Sasanam, Talatampara, Yekkala (village) ------------------------------------------------------------- Kaviti Bhyripuram, Borivanka, D.G.Puttuga, Gorlepadu, Jagathi, Kapasukuddi, Karapadu, Kaviti (village, and mandal headquarters) kavti kotturu, Donkaputtuga(village in Kaviti ) Khojjiria, Kusumpuram, Landari Puttuga, Manikyapuram, Nelavanka, Pragadaputtuga, Rajapuram, Sahalala Puttuga, Silagam, Varaka, -------------------------------------- Kotabommali Akkayyavalasa, Cheepurlapadu, China Bammidi, Chinnasana, Chittivalasa, Dantha, Duppalapadu, Gangaram, Harishchandrapuram, Jarjangi, Jiyyannapeta, Kannevalasa, Kasturipadu, Kistupuram, Kotabommali (village, and mandal headquarters) Kothapalli, Kothapeta, Kurudu, Lakkamdiddi, Masahebpeta, Narayanavalasa, Neelampeta, Nimmada, Pattupuram, Peda Bammidi, Rameswaram, Regulapadu, Sariyaboddapadu, Sariyapalli, Sowdam, Srijagannadhapuram, Tarlipeta, Thatiparthi, Tilaru, Vandrada, Viswanadhapuram, Yelamanchili, Yetturallapadu (village) ----------------- Kothuru, Srikakulam Kadumu, balada, Kausalyapuram, viranarayanapuram, Kurigam, dimili, althi, boddaguda, kakaraguda,Rayala ponnuturu, kuddigam, chompa, mattala, sirisuwada, Kotturu, karlemma, mahartapuram,vasapa, nivagam, venkatapuram, sandipolam, bammidi, kaligam, parapuram, labba, addangi,irapadu, peddamadi, ondrujola, neradi, gurandi, pathapadu, Sobhanapuram, anguru, akulatampara --------------------- Kotturu, Srikakulam Akulatampava, Althi, Balada, Bammidi, Dimili, Erapadu, Gottipalli, Gunabadhra, Gurandi, Hamsa, Jagannadhapuram, Kadumu, Kaligam, Karlemma, Khurigam, Kotturu (village, and mandal headquarters) Kuddigam, Kuntibadra, Labba, Madanapuram, Makavaram, Mathala, Metturu, Neelakantapuram, Neradi, Nivagam, Parapuram, Ponnuturu, Rayala, Sirusavada, Somarajapuram, Vasapa, Vendrujola, ----------------------- Lakshminarasupeta --------------------- Laveru Adapaka Appapuram Bejjipuram Budatavalasa Budumuru Chinna Murapaka Govindapuram Gummadam Gurralapalem Gurugubilli Kesavarayunipalem Kothakota Kothakunkam Lakshmipuram Laveru Lopenta Murapaka Pathakunkam Pedakothapalli Peddalingalavalasa Peddaraopalli Pothayyavalasa Sigirikothapalli Tamvada Thallavalasa Venkatapuram ------------------------------------------------ Mandasa [Ambugam], Bahadapalli, Bairi Sarangapuram, Baligam, Bellupatia, Bethalapuram, Bhoghabandha, Binnala, Bogapuram, Budarasingi, Cheepi, Dunnavooru, Hamsarali, Haripuram, Honnali, Jillunda, Kondalogam, Konkadaputti, Kottapalli, Kuntikota, Loharibanda, Makarajola, Mandasa (village, and mandal headquarters) Mulipadu, Narasingipuram, #rajkumarరవ₭ Narayanapuram, Pidi Mandasa, Pitatoli, Pottangi, Rampuram, Sabhakota, Sariyapalli, Siddigam, Siripuram, Sondipudi, Suvarnapuram (village) ------------------ Meliaputti Banapuram, Bharanikota, Chapara, Chipurupalle, Deenabandhupuram, Gangarajapuram, Gokarnapuram, Goppili, Jadupalli, Joduru, Karajada, Kerasingi, Kosamala, Maredukota, Marripadu (C), Marripadu (K), Meliaputti, Muktapuram, Nadasandara, P.L.Puram, Padda, Parasurampuram, Pattupuram, Peda Padmapuram, [ Rattini, S.L.Puram, Sekharapuram, Siriakandi, Sundarada, Vasundhara, Venkatapuram (village) --------------------------------- Nandigam, Srikakulam ------------------ Narasannapeta Badam, Balaseema, Borigivalasa, Chennapuram, Chikkalavalasa, Chinaborigivalasa, Chodavaram, Devadi, Gopalapenta, Gottipalli, Jammu, Kambakaya, Kameswaripeta, Karagam, Killam, Komarthy, Kothapolavalasa, Lukulam, Madapam, Makivalasa, Musidigattu, Nadagam, Narasannapeta ( ( and mandal headquarters) Paraselli, Pothayyavalasa, Ravulavalasa, Satyavaram, Sundarapuram, Tamarapalli, Thelagavalasa, Urlam Chintuvanipeta, Varahanarasimhapuram, Yarabadu, Kobagam (village) ------------------------ Palakonda Ampili, Annavaram, Aradala, Attali, Avalangi, Basuru, Bejji, Bukkuru, Chinna Mangalapuram, Chintada, Dolamada, Duggi, Gopalapuram, Gotta Mangalapuram, Jamparakota, Kondapuram, Lovidi Laxmipuram, Lumburu, Navagam, Palakonda (Nagar &mandal Headquarters) Panukuvalasa, Pedda Kotipalli, Potli, Singannavalasa, Singupuram, T.K.Rajapuram, Talavaram, Tampatapalli, Tumarada, V.P.Rajupeta, Vatapagu, Velagavada, Voni, Yarakarayapuram, Gudivada(village) Kotipalli(village&) ----------------------- Palasa-Kasibugga Allukola, Amalakhudia, Bantu Kotturu, Boddapadu, Brahmana Tharla, Laxmi Puram, Chinabadam (village and municipality) with 4000 population Vajrapukotturu, Chinanchala, Garudugandi, Grudasupuram, Kedaripuram, Laxmipuram, Sasanam Ramaraob, Lotturu, Loddabhadra (Village cum Gram ) Mamidimettu, Neelavathi, Peda Makanapalli, Pedanchala, Rentikota, Tekkalipatnam, Tharlakota, Garuda Bhadra(village) Gaduru, Metturu (village and Panchayithi) Damodar Vonkuluru (village and Panchayithi) Ankapalli (village and Panchayithi) Bapu Nagar (village and Panchayithi) ---------------------- Pathapatnam A.S.Kaviti, Baddumarri, Borubadra, Buragam, Chakipalli, Changudi, China Mallipuram, Dhasaradhapuram, Ganguvada, Gurandi, Kaguvada, Koduru, Korasavada, Pasigangupeta, Pathapatnam (Town and major ) Peda Laxmi Puram, Peda Sariapalli, Peda Sunnapuram, Pedda Logidi, Pedemallipuram, Rankini, Romadala, Rompivalasa, Routhu Laxmi puram, Sarali, Savarasiddamanugu, Seedi, Seetharampalli, Singupuram, Sobha, Tamara, Teemara, Temburu, Tiddimi (village) -------------------- Polaki, Srikakulam Ampalam, Ambeerupeta, Belamarapolavalasa, Boddam, Challayyavalasa, Cheedivalasa, Dandulakshmipuram, Deerghasi, Dola, Edulavalasa, Ganagivalasa, Ghathalavalasa, Gollalavalasa, Guppadipeta, Jaduru, Koduru, Kotharevu, Kusumpolavalasa, Mabagam, Magatapadu, Pallipeta, Pinnintipeta, Piruvada, Polaki, Priya, Agraharam, Rahimanpuram, Rajapuram, Rallapadu, Santhalaximipuram, Susaram, Talasamudhram, Urjam, Vanithamandalam ------------------------- Ponduru ------------------- Rajam, Andhra Pradesh Aguru, Anthakapalli, Boddam, Bomminaidu Valasa, D.R.N.Valasa, Gadimudidam, Garraju Cheepurupalli, Guravam, Kancharam, Kondampeta (A part in Rajam municipality) Kotaripuram, Kothavalasa (A part in Rajam municipality) Maredubaka, Muddada Jogivalasa, Nandabalga, Ommi (village terli srinivas Rao) Kothapeta ,Penubaka, Pogiri, Rajam, Rajayyapeta, Saradhi, Soperu, Syampuram, V.R.Agraharam, NOW THE IS CONVERTED TO "NAGAR (mini municipality)" -------------- Ranastalam Allivalasa, Arnunavalasa, Bantupalli, Chillapeta Rajam, Derasam, J.R.Puram, Jeerupelam, Kammasigadom, Konda Mulagam, Kosta, Kotapelam, Kotcherla, Kovvadamatsalesam, Krishnapuram, Mahantipelam, Maruvada, N.G.R.Puram, Naruva, Patharalapalli, Pisini, Pydibhimavaram, Ranastalam (village and and mandal headquarters) Ravada, Sancham, Teppalavalasa, Tirupathipalem, V.N.Puram, Vallabharao Peta, Veluparai, Yerravaram (village) ----------------------------- Regidi Amadalavalasa Adavaram Amadalavalasa,Regidi Ambada Ambakhandi Appapuram Burada Chatayavalasa Cheliganivalasa Chinna Sirlam Davudala Gullapadu Kandisa Khandyam Kodisa Komiri Kondavalasa Korllavalasa Latcharayapuram Laxmipuram Lingalavalasa Munakalavalasa Nayaralavalasa Panasalavalasa Parampeta Peda Sirlam Purli Regidi Sankili Sarasanapalli Somarajupeta Thatipadu Thokalavalasa Tunivada Ungarada Unukuru Vannali Vavilavalasa nagaraju Venkampeta Voppangi -------------------------------- Santha Bommali Akakslakkavaram, Arikavalasa, Bhavanapadu, Borubhadra, Godalam, Chatlathandra, Chinnadoogam(Village) Chinathungam, Dandu Gopalapuram, Pedda Doogam(Village) Govindapuram, Hanumanthu Naidu Peta, Ijjuvaram, Jagannadhapuram, Jamachakram(village) K.Lingudu, Kakarapalli, Kapugodayavalasa, Kaspa Naupada, Kollipadu, Kotapadu, Lakkivalasa, Malagam, Marripadu, Maruvada, Meghavaram, Mulapeta, Narasapuram, Palatalagam, Runku, S.B.Kotturu, Srikrishnapuram, Santhabommali (village, and mandal headquarters) Tallavalasa, Thotada, Umilada, Vadditandra, Vaddivada, Yamalapeta (village) ------------------------------ Santhakavati A.P.Agraharam, Billani, Bodduru, Buradapeta(Village) Chinnayyapeta, Chitaripuram, G.S.Puram, Garikipadu -Mr.Madhavarapu Subbarao Panthulu garu worked as a grammunasaf during the period 1955, Gollaseetharampuram, Gollavalasa, Govindhapuram, Honjaram, Javam, K.Ramachandrapuram, Kakarapalli, Kavili, Kondagudem, Krishnamvalasa, Mamidipalli, Mandakurti, Mandarada, Mantina, Mirthivalasa, Modugulapeta, Ponigintivalasa, Pullita, Ramarayapuram, S.Rangarayapuram, Santhakaviti (village, and mandal headquarters) Siripuram, Suravaram, Talada, Talatampara, Tamaram, Vasudevapatnam, Waltair, Madhavaraya puram (Village) ---------------- Saravakota ---------------- Sarubujjili Boppadam, Chiguruvalasa, Chinna Kagithapalli, Dakaravalasa, Gonepadu, Isakalapalem, Kondavalasa, Kothakota, Mathalabpeta, Moola Savalapuram, Palavalasa, Peddapalem, Purushottampuram, Ravivalasa, Rottavalasa, Sarubujjili (village, and mandal headquarters) Shalanthri, Sindhuvada, Thelikipenta, Vijayarampuram, Yaragam (village) ------------------ Seethampeta Chinnabagga Dharapadu Donubhai Goidhi Gumada Haddubangi Jilledupadu Kadagandi Killada Kirapa Kisarijodu Kodisa Kondada Kuddapalli Kusumi Malli Manda Marripadu Patha Panukuvalasa Pedduru Pedapolla Pedharama Pubbada Puliputti Puthikivalasa Samarelli Sambham Seethampeta Somagandi Titukupai Valagedda ----------------------------------------- Sompeta Baruva, Batupuram, Benkili, Besi Ramachandrapuram, Bushabhadra, Gollagandi, Gollavoru, Iskala Palem, Kartali Palem, Korlam, Makannapuram, Mamidipalli, Palasapuram, Palavalasa, Potrakonda, Rushikudda, Sirimamidi, - Sompeta (Urban, and mandal headquarters) Sunkidi, Tallabadra, Turakasasanam, Uppalam, Zinkibhadra (village) ---------------------- Srikakulam ------------------- Tekkali Akkavaram, Ayodhyapuram, Bannuvada, Bhagavanpuram, Boppaipuram, Buragam, Chakipalle, Gudem, Konusula Kothuru, Lingalavalasa, Meghavaram, Mokhalingapuram, Narsingapalle, Parasurampuram, Patha Naupada, Pedarokallapalli, Peddasana, Polavaram, Radhavallabhapuram, Ravivalasa, Sasanam, Seethapuram, Talagam, Tekkali (village, and mandal headquarters) Telineelapuram, Thirlangi, Tolusurupalli, Dharamaneelapuram, Rampuram (village) ----------------- Vajrapu Kotturu Akkupalli, Amalapadu, Anathagiri, Baipalli, Bathupuram, Bendi, Cheepurupalli, Chinnavanka, Devunalthada, Dokulapadu, Garudabhadra, Govindapuram, Gunupalli, K.R.Peta, Kidisingi, Komaralthada, Kondavooru, Kottapeta, Laxmidevi Peta, Manchineella Peta, Metturu, Nagarampalli, P.J.Puram, P.M.Puram, Palli Saradhi, Pallivooru, Patha Tekkali, Pedda Boddapadu, Pedda Badam, Rajam, Reyyipadu, S.J.Puram, Sainuru, Uddanam Gopinadhapuram, Uddanam Ramakrishnapuram, Undrukudia, Vajrapu Kotturu --------------------------- Veeraghattam Adaru, Bitiwada, Chalivendri, Chdimi, Chittipudivalasa, Dasamanthuram, Gadagamma, Hussenpuram, Kambara, Kattula Kaviti, Kimmi, Kottugummada, Kummari Gunta, Nadimikella, Nadukuru, Neelanagaram, P.V.R.Puram, Panasa Nandivada, Regulapadu, Santha Narsipuram, Talavaram, Tettangi, Tudi, Vanduva, Veeraghattam (village, and mandal headquarters) Vikrampuram (village)

1 comment: